V6 News

సచిన్ టెండూల్కర్ కు క్షమాపణలు చెప్పిన స్పార్టన్

సచిన్ టెండూల్కర్ కు క్షమాపణలు చెప్పిన స్పార్టన్

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్యాట్ల తయారీ సంస్థ స్పార్టన్… క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు క్షమాపణలు చెప్పింది. సచిన్, స్పార్టన్ కు మధ్య గత కొంతకాలంగా ఒప్పంద ఉల్లంఘన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇచ్చిన మాట తప్పినందుకు సచిన్ టెండూల్కర్‌ మన్నించాలంటూ స్పార్టన్‌ సీఓఓ లెస్‌ గాల్ ‌బ్రెత్‌ కోరారు. దీనిపై  సచిన్ సానుకూలంగా స్పందించి, వివాదాన్ని ముగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని గౌరవించనందుకు సచిన్‌ కు మా హృదయపూర్వక క్షమాపణలని తెలిపారు బ్రెత్. అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన సచిన్‌ తీరుకు మా కృతజ్ఞతలు అని అన్నారు.

2016లో స్పార్టన్ కంపెనీకి సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయగా, ఒప్పందం ప్రకారం రాయల్టీ, ఎండార్స్‌ మెంట్‌ ఫీజులను చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సచిన్ పేరును వాడుకుంది. దీంతో సచిన్ రూ. 15.1 కోట్లు చెల్లించాలంటూ గతేడాది  ఆ సంస్థపై కేసు వేశారు.