హైదరాబాద్ లో సదర్ సంబురం షురూ

హైదరాబాద్ లో సదర్ సంబురం షురూ

ఖైరతాబాద్,వెలుగు :  దీపావళి పండుగను పురస్కరించుకుని  ఖైరతాబాద్ ​నవయుగ యాదవ్​సంఘం ఆధ్వర్యంలో  మంగళారపు చౌద్రి యాదయ్య యాదవ్​ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్​ సమ్మేళనం జరిగింది. సుల్తాన్​పురాకు చెందిన శ్రీకృష్ణ డైరీఫాం నిర్వాహకుడు ఎం.​మల్లేశ్​యాదవ్​కు చెందిన దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సదర్ ఉత్సవానికి  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దానం నాగేందర్​ హాజరై తొలిపూజ చేసి ప్రారం భించి మాట్లాడారు. సదర్ వేడుకల్లో రాజు యాదవ్​,సుధాకర్​ యాదవ్​,మల్లికార్జున్ యాదవ్​, మహేశ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గండిపేట్ : నార్సింగిలో సదర్‌‌ సమ్మేళనం మున్సిపల్ వైస్‌‌ చైర్మన్‌‌ వెంకటేశ్​యాదవ్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించగా  రాజేంద్రనగర్‌‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌‌ గౌడ్‌‌  హాజరై దున్నపోతులకు పూజలు చేశారు. అనంతరం వాడవాడలా డప్పు దరువుల మధ్య దున్నపోతులను ఊరేగించారు. నిజాం కాలం నుంచి సదర్​ఉత్సవం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ పేర్కొన్నారు.