శాడిస్ట్ మహిళ : చిన్నపిల్లాడితో చెదలు మందు తాగించింది

శాడిస్ట్ మహిళ : చిన్నపిల్లాడితో చెదలు మందు తాగించింది

విశాఖపట్నం నగరంలో దారుణం జరింగింది. ఓ శాడిస్ట్ మహిళ మూడేళ్ల చిన్నారికి చెదలు మందు తాగించడంతో.. హాస్పిటల్ పాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

మాధవ ధార ప్రాంతానికి చెందిన 3 ఏళ్ళ చిన్నారి కార్తికేయ శ్రీమాన్ కు వారి ఎదురు ఫ్లాట్ లో ఉంటున్న 45 ఏళ్ల మహిళ హరిత చెదలు మందు పట్టించింది. దీంతో.. బాలుడు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విషయం తెలుసుకున్న తండ్రి… బాలుడిని వైజాగ్ ఓమ్నీ హాస్పిటల్ లో చేర్పించాడు. బాలుడి ఆరోగ్యం విషమించడంతో… ఎమర్జెన్సీ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నట్టు తండ్రి చెప్పాడు.

ఈ సంఘటనపై కంచరపాలెం పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా మహిళ హరిత .. తోటి వారితో శాడిస్ట్ లా ప్రవర్తిస్తోందని స్థానికులు చెప్పారు. బాలుడితోనూ అలాగే చెదలు మందు తాగించి ఉంటుందని అనుమానిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి తెలుసుకునేందుకు ఓమ్నీ హాస్పిటల్ కు జిల్లా జడ్జీ వెళ్లారు. డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు.