
జోహన్నెస్‌బర్గ్: ఇండియాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఏస్‌ఏ) తమ జట్టును మంగళవారం ప్రకటించింది. మొత్తం 21మంది ప్లేయర్లను సీఎస్‌ఏ ఈ సిరీస్ కోసం ఎంపిక చేసింది. కెప్టెన్‌గా డీన్ ఎల్గర్, వైస్ కెప్టెన్‌గా టెంబా బవ్యూమా వ్యవహరించనున్నారు. స్టార్ క్రికెటర్లు క్వింటన్ డికాక్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్‌తోపాటు డునె ఆలివర్ టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన మార్కో జెన్సన్ కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. సిసిండా మగాల, రియాన్ రికెల్టెన్ తొలిసారి టెస్ట్ జట్టు పిలుపు అందుకున్నారు.
జట్టు : ఎల్గర్ ( కెప్టెన్), బవ్యూమా, డికాక్, రబాడ, సరెల్ ఎర్వీ, బెరన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, ఎంగిడి, మార్‌క్రమ్, ముల్దర్, నోర్జ్, కెగన్ పీటర్సన్, డుసెన్, కైల్ వెర్రియెన్, మార్కో జెన్సన్, స్టువర్ట్‌మన్, సుబ్రెయిన్, మగాల, రికెల్టెన్, ఆలీవర్.