సాయి పల్లవికి సర్జరీ.. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా?

సాయి పల్లవికి సర్జరీ.. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా?

సాయి పల్లవి(Sai pallavi)కి సర్జరీ జరిగిందట. చాలా సీక్రెట్ గా ఉంచిన ఈ మ్యాటర్ తన ఫ్రెండ్స్ ద్వారా బయటపడింది. ప్రస్తుతం ఆమె కొంతకాలంగా విశ్రాంతిలో ఉంటుందని సమాచారం. ఈ కారణంగానే సాయి పల్లవి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. 

ఇక అసలు విషయం ఏంటంటే.. సాయి పల్లవి కొంతకాలం క్రితం ఒక సినిమా సాంగ్ షూట్ లో డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె కాలికి గాయమైందట. ఆ సమయంలో గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదట సాయి పల్లవి. దీంతో.. కొద్దిరోజులకే ఆ నొప్పికాస్త పెద్దదవడంతో.. డాక్టర్ ను సంప్రదించారట. సాయి పల్లవి కాలును పరీక్షించిన వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని సూచించారట. ప్రస్తుతం ఆమెకు సర్జరీ ముగిసి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపారు ఆమె స్నేహితులు. 

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయతో ఒక సినిమా, సింగా పడై అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.