'విక్రమ్ వేద' ప్రమోషన్ ఫొటో షూట్ లో సైఫ్ అలీఖాన్

'విక్రమ్ వేద' ప్రమోషన్ ఫొటో షూట్ లో సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ స్టార్ హీరోస్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం విక్రమ్ వేద విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం నటీనటులు ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్నారు. అందులో భాగంగా సైఫ్ అలీఖాన్ స్టైలిష్ లుక్స్ తో ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంగది. ఈ మూవీలో హృతిక్ గ్యాంగ్ స్టర్ గా, సైఫ్ అలీఖాన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ మూవీ రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్స్, టీ సిరీస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి.