జగన్ చెల్లి కాకపోతే.. కాంగ్రెస్ పట్టించుకునేదా: సజ్జల

జగన్ చెల్లి కాకపోతే.. కాంగ్రెస్ పట్టించుకునేదా: సజ్జల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.  ఆమె వైఎస్సార్ బిడ్డ.... ఏపీ సీఎం జగన్ చెల్లెలు కాకపోతే కాంగ్రెస్ ఆమెను పట్టించుకొనేదా అని ప్రశ్నించారు.  ఓదార్పు యాత్ర చేసేటప్పుడు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ఎన్నో సార్లు చెప్పిందని సజ్జల అన్నారు.

ఏపీ రాజకీయాలపై షర్మిల కు అవగాహన లేదంటూ.. తనకు జరిగిన అన్యాయం ఏంటో షర్మిల చెప్పాలన్నారు సజ్జల.  పదవి ఇవ్వకపోవడం అన్యాయమా అని ప్రశ్నించారు.  ఆరోగ్య శ్రీ, ఫీ రీ ఎంబర్స్ మెంట్ అమలు కావడం లేదని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. షర్మిల వ్యాఖ్యలకు పొంతన లేదంటూ.. ఆమెకు చంద్రబాబు స్క్రిప్ట్ రాయించారేమో అనుమానం వ్యక్తం చేశారు.  తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల .. ఇప్పుడు ఏపీలో అదే పార్టీలో చేరారని... వైఎస్ మరణం తరువాత రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే షర్మిల ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  వైఎస్ జగన్ (CM YS Jagan) పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. 16 నెలలు సీఎం జగన్ ను జైళ్లో పెట్టారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన ప్రతి గుండె సీఎం జగన్ ను ప్రేమిస్తుందని అన్నారు.