సీఎం చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మినిస్టర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆదివారం ( మే 31 ) కీలక నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మినిస్టర్ అని.. హామీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం పెట్టారని అన్నారు.
మొన్న జరిగింది మహానాడు కాదు లోగ్రేడ్ నాడు అని అన్నారు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు సజ్జల. టీడీపీకి వైసీపీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు సజ్జల. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు సజ్జల.
చంద్రబాబు పాలిట జగన్ గొడ్డలి, కత్తి, త్రిశూలమేనని అన్నారు సజ్జల. చంద్రబాబును రాజకీయంగా అంతం చేసేది జగనేనని.. అందుకే గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు సజ్జల.
