హైదరాబాద్, వెలుగు: సాలార్ జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ(75 ఏండ్లు) వేడుకల సందర్భంగా మంగళవారం భారతీయ శాస్త్రీయ సంగీతం, గజల్ సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. డీజీపీ సతీమణి, గాయని లలిత ఆనంద్ గజల్ సంగీత విభావరితో అలరించారు.
రంజిష్ హీ సహీ(రాగ్ యమన్) సహా పలు ప్రసిద్ధ గజల్స్‌ను ఆలపించారు. ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
