మోడీ ప్రభుత్వంలో జీతాలు పెరుగుతాయట!

మోడీ ప్రభుత్వంలో జీతాలు పెరుగుతాయట!

9.2 శాతం పెంపుకు చాన్స్‌

న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు 9.2 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని కార్న్‌ ఫెర్రీ గ్లోబల్‌ అనే అంతర్జాతీయ సంస్థ స్టడీ రిపోర్ట్‌ తెలిపింది. ఆసియా దేశాల్లో ఇదే అత్యధిక పెరుగుదల అని పేర్కొంది. ఈ ఏడాది జీతాలు 10 శాతం పెరిగాయని, 2020లో మాత్రం కాస్త తగ్గుతుందని కార్న్‌ ఫెర్రీ రిపోర్ట్‌ వివరించింది. ‘‘ఇతర దేశాల్లో జీతాల పెరుగుదల తగ్గుతున్నా, ఈ విషయంలో ఇండియా పరిస్థితి బాగుంది.

మోడీ ప్రభుత్వం ఎకానమీ అభివృద్ధి కోసం చేస్తున్న మార్పుల వల్ల అన్ని సెక్టార్ల ఉద్యోగులూ ఇంక్రిమెంట్లు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా జీతాల పెరుగుదల రేటు 4.9 శాతం వరకు ఉండొచ్చు’’ అని కార్న్‌ ఫెర్రీ ఇండియా చైర్మన్ రీజనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవ్‌నీత్‌ సింగ్‌ చెప్పారు. ఆసియాలో రియల్‌ వేజ్‌ (వాస్తవిక వేతనాలు) పెరుగుదల రేటు గరిష్టంగా 5.3 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.