మరో ఐదేళ్లు ఇన్ఫోసిస్‌ సీఈవోగా సలీల్‌ పరేఖ్‌

మరో ఐదేళ్లు ఇన్ఫోసిస్‌ సీఈవోగా సలీల్‌ పరేఖ్‌

రో ఐదేళ్ల పాటు ఇన్ఫోసిస్‌ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో,CEO)గా సలీల్‌ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని పొడిగించినట్లు ఇన్ఫోసిస్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జులై 1 నుంచి  2027 మార్చి 31వరకు సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవో(CEO)గా కొనసాగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఇన్ఫోసిస్‌ ఎక్స్‌ప్యాండ్‌ స్టాక్‌ ఓనర్‌ షిప్‌ -2019 ప్లాన్‌ లో భాగంగా సలీల్ పరేఖ్ కు ఇన్ఫోసిస్‌ షేర్లను కట్టబెట్టనుంది. 

మే 21న ఇన్ఫోసిస్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ(ఎన్‌ఆర్సీ) సభ్యులు సలీల్‌ పరేఖ్‌ను మళ్లీ సంస్థ సీఈవోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. స‌లీల్ ప‌రేఖ్ 2018 జ‌న‌వ‌రి నుంచి గ‌త నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా విజ‌య‌వంతంగా సంస్థ‌కు సార‌ధ్యం వ‌హించారు. అంత‌ర్జాతీయంగా ఐటీ సేవ‌ల రంగంలో 30 ఏండ్ల‌కు పైగా అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తి. ఇంత‌కుముందు క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు స‌భ్యుడిగా ప‌ని చేశారు. క్యాప్‌జెమినీలో 25 ఏండ్ల‌పాటు వివిధ క్యాట‌గిరీల్లో విధులు నిర్వర్తించారు. బాంబే ఐఐటీలో ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసుకున్న స‌లీల్ ప‌రేఖ్‌.. కార్న్‌వెల్ యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌ల్లో ఎంటెక్ ప‌ట్టాలు అందుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

రేపు జపాన్కు వెళ్లనున్న పీఎం మోడీ

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు..ఎలానో తెలుసా ?