ఈ ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఈ ఆరు నెలలు కష్టంగా గడిచాయి.. సమంత ఎమోషనల్ పోస్ట్

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samatha) గత కొంత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాధి చికిత్స కోసం సినిమాలకు సైతం దూరంగా గడిపారు సమంత. ఇందులో భాగంగా కొన్నాళ్లపాటు కేరళ వైద్యం కూడా చేయించుకున్నారు. దీంతో సమంతకు అంతా సెట్ అయిపోయింది అనుకున్నారంతా.

తరువాత ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. దీంతో సమంత ఆరోగ్యం కుదుటపడింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. సమంత ఫ్యాన్స్ కూడా ఊపిరిపీల్చుకున్నారు. 

అయితే తాజాగా సమంత పెట్టిన రెండు పోస్టులు తన ఫ్యాన్స్ ను మళ్ళీ కలవరపెడుతున్నాయి. అందులో మొదటి పోస్టులో.. "మరో మూడు రోజుల్లో కారవాన్ లైఫ్ మొదలవ్వబోతుంది' అని పెట్టారు. అంటే ఈ మూడు రోజులు సమంత బయట కనిపించదని అర్థం. ఇక రెండో పోస్టులో.. ఈ ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి" అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత అమెరికాలో మాయిసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోనున్నారు. ఇందుకోసమే ఆమె ఇటీవలే అమెరికాకు వెళ్లారని సమాచారం.

ఇక సమంత చేసిన ఈ పోస్టులు చూసిన ఫ్యాన్స్.. ఆమె ఆరోగ్యం ఇంకా నయమవలేదా? సామ్ నువ్వు తొందరగా కోలుకొని.. మళ్ళీ సినిమాలు చేసే మమ్మల్ని ఎంటర్నైట్ చేయాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.