సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకున్నారు. పుకార్లకు చెక్ పెడుతూ నిజంగానే ఒక్కటి అయిన ఫొటోలు రిలీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీళ్లిద్దరూ ఒక్కటి అయినట్లు అధికారికంగా.. ఫొటోలతో ప్రకటించేసింది సమంత.
సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూఢం.. పెళ్లి ముహూర్తాలు లేవు. ఇలాంటి టైంలో వాళ్లు పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ చాలా మంది నెటిజన్లు డౌట్స్ రైజ్ చేశారు. సమంత పెళ్లి వార్తలు పుకార్లు అని అందరూ కొట్టిపారేశారు.
ఈ పుకార్లను నిజం చేస్తూ.. మేం పెళ్లి చేసుకున్నాం అంటూ సమంత.. తన పెళ్లి ఫొటోలను రిలీజ్ చేయటంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు కదా అని అందరికీ డౌట్ వస్తుంది. ఏ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమంత, రాజ్ నిడుమోరు ఇద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు.
ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి అమ్మవారి సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటి అయ్యారు. ఈ పెళ్లి వేడుకలో సమంత, రాజ్ నిడుమోరు కుటుంబాల నుంచి ఆప్తులు, అత్యంత దగ్గరి సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. చాలా చాలా కొద్ది మంది సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటి అయినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
