పేరు మార్చుకున్న సమంత

పేరు మార్చుకున్న సమంత

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు మార్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. కంగారు పడకండి.. ఆమె స్క్రీన్ నేమ్‌ మార్చుకోలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైల్స్ నేమ్స్‌ను మార్చుకుంది. ట్విట్టర్, ఇన్‌స్టాల్లో సమంత రుత్ ప్రభుగా ఉన్న తన అకౌంట్‌ నేమ్‌‌ను ‘ఎస్‌’గా మార్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమంత ఎందుకు ప్రొఫైల్ పేరు మార్చిందా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే గానీ స్పష్టత రాదు.