నిర్మాతగా మారిన సమంత.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటో తెలుసా..

నిర్మాతగా మారిన సమంత.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటో తెలుసా..

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి దానికి 'ట్రలాలా మూవీ పిక్చర్స్ ' అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని తన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సమంత ప్రకటించింది. "నా సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవీ పిక్చర్స్ 'ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని సమంత తెలిపింది. 

కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా పిక్చర్స్ లక్ష్యమని.. అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే ప్లాట్ఫాం ఇది అని సమంత పేర్కొంది. తాను చిన్నప్పుడు విన్న ఇంగ్లీష్ పాట 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ' లోని లాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు ఆమె వెల్లడించింది. ఇక ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించినందుకుగాను సమంతకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.