నమ్మకమే మీ గురువు : సమంత

నమ్మకమే మీ గురువు : సమంత

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌‌‌‌గా కొనసాగుతూ, సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ  యాక్టివ్‌‌‌‌గా ఉంటుంది. తన సినిమాలకి సంబంధించిన అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో పాటు పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది.  ఇటీవల ఆమె చేసిన పోస్ట్ ఒకటి వైరల్‌‌‌‌గా మారింది. లింగ భైరవి దేవి అమ్మ వారి ముందు మెడిటేషన్ చేస్తున్నట్లుగా ఉన్న  ఫోటో షేర్ చేసిన సమంత.. దానికి ఇంటరెస్టింగ్‌‌‌‌  క్యాప్షన్‌‌‌‌ ఇచ్చింది. ‘జీవితంలో నమ్మకమే ప్రధానమైన బలం. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు.. నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అంటూ పోస్ట్ చేసింది.  ‘మయోసైటిస్‌‌‌‌’ నుండి ఇటీవలే కోలుకున్న సమంత.. ప్రస్తుతం వరుస షూటింగ్స్‌‌‌‌లో పాల్గొంటుంది.  ‘సిటాడెల్‌‌‌‌’ అనే ఇంగ్లీష్ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో పాటు విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది.  గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.