మలయాళం నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఒకరు. కాగా సంయుక్త మీనన్ టాలీవుడ్ లో సార్, విరూపాక్ష, డెవిల్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ టాలీవుడ్ ప్రముఖ హీరో బెల్లంకొండ హీరోగా నటిస్తున్న BSS12 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈరోజు సంయుక్త మీనన్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంయుక్త మీనన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంయుక్త మీనన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ తన చిత్రంలో సమీరా పాత్రలో నటిస్తున్నట్లు సంయుక్త మీనన్ క్యారెక్టర్ పేరు రివీల్ చేశాడు. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించి పోస్టర్ ని కూడా షేర్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ఈ విషయం ఇలా ఉండగా 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా నూతన దర్శకుడు లుధిర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Happy Birthday @iamsamyuktha_!!! It’s amazing to work alongside you….Definitely a special project for all of us. Let’s kill it! 🤗❤️#BSS12 @Moonshine_Pctrs #MaheshChandu @SaiShashank4u @Leon_James @DSivendra @KarthikaSriniva @ludheerbyreddy pic.twitter.com/H9gMQ7NEHZ
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) September 11, 2024