
సికింద్రాబాద్, వెలుగు : కంప్లైంట్చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళతో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన సనత్ నగర్ ఇన్స్పెక్టర్పురేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సనత్‌నగర్‌లో ఉండే మహిళ ఓ కేసు విషయంలో ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఇన్స్పెక్టర్పురేందర్రెడ్డి ఆమె నుంచి ఫిర్యాదుతోపాటు ఫోన్నంబర్తీసుకున్నాడు. తర్వాత ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.
‘అందంగా ఉన్నావు.. నేను చెప్పిన ప్లేస్‌కు వస్తావా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. తాను అలాంటి దాన్ని కాదని మహిళ చెప్పినా వినిపించుకోకుండా వేధించసాగాడు. విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన సీపీ దర్యాప్తు చేపట్టి ఇన్ స్పెక్టర్ పురేందర్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.