ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. పోచంపల్లి చీరను బహుమతిగా ఇచ్చిన మోదీ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. పోచంపల్లి చీరను బహుమతిగా ఇచ్చిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది.  2023 జూలై 15న జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో సత్కరించారు.   ఆ దేశ పెద్దలకు భారత సంస్కృతికి చెందిన కానుకలను అందజేశారు మోదీ.  అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను మోదీ బహుకరించారు. గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. 

ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇ‍క్కత్‌ చీర  తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్‌లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి.  

కాగా  రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బయల్దేరారు.  2023 జూలై 15  శనివారం ఆయన అబుదబీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు రంగాల ప్రతినిధులతో మోదీ భేటీ కానున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయోద్‌ అల్‌ నహ్‌యన్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.