క్రికెటర్‌‌ను వదలని రేప్ కేసు.. బాధితురాలు ఆత్మహత్యాయత్నం

 క్రికెటర్‌‌ను వదలని రేప్ కేసు.. బాధితురాలు ఆత్మహత్యాయత్నం

నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. గతేడాది ఆగస్టులో ఖాట్మండులోని ఓ  హోటల్ గదిలో మైనర్ (17) బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో జైలు కెళ్లిన అతడు.. ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగున్నాడు. ఉన్నట్టుండి.. ఈ కేసు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.  

వివిధ కారణాలతోఈ  కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం( ఆగష్టు 27) నాటి తాజా విచారణలో.. తదుపరి విచారణ సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లామిచానే తరపు న్యాయవాది సరోజ్ ఘిమిరే తెలిపారు. ఈ నేపథ్యంలో అతనికి ఆసియా కప్ టోర్నీలో పాల్గొంనేందుకు అనుమతి లభించగా.. జట్టు సభ్యులతో కలిసి పాకిస్తాన్ బయలుదేరారు. ఇంతలోనే ఈ కేసు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.

మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగానే బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డాక్టర్లు సూచించిన పరిమితులను మించి ఆమె మందులు వాడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఖాట్మండులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నేపాల్ జట్టు ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొనటం ఇదే తొలిసారి కాగా, ఆగష్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది.