సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్

సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును హైదరాబాద్ లో  ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సివిల్ వ్యవహారంలో తమను రూ. 250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రీధర్ రావుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలోనూ ఆయన రెండుసార్లు అరెస్టయ్యారు. కాగా అరెస్టు అనంతరం శ్రీధర్ రావును పోలీసులు ఎయిర్ పోర్ట్  పోలీస్ స్టేషన్ నుండి ప్రైవేట్ వాహనంలో రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు.

రూ.180 కోట్లు తానే చెల్లించానని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు చెప్పారు. ఈ విషయం న్యాయపోరాటం చేస్తానని, తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని స్పష్టం చేశారు. నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేశాననడం అవాస్తవమని శ్రీధర్ ఆరోపించారు. తానెవర్నీ మోసం చేయలేదని తెలిపారు.