
- సీఈ జయభారతికి ఈఎన్సీగా బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ ఈఎన్సీ తిరుమల సోమవారం రిటైర్ అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. రీజనల్ రింగ్ రోడ్ (సౌత్) పార్ట్ అలైన్ మెంట్, హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుల అనుమతిలో కీలక పాత్ర పోషించారు. తిరుమల రిటైర్ మెంట్ తో ఈఎన్సీ బాధ్యతలను చీఫ్ ఇంజనీర్ జయభారతికి అప్పగించారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అహ్మద్ నదీమ్.. తిరుమలకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో తిరుమలను అధికారులు ఘనంగా సన్మానించారు. డిజైన్స్ సీఈ బాధ్యతలను రాయమల్లుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ కూడా సోమవారం రిటైర్ అయ్యారు.