
మీకు టీవీ చూడటం ఇష్టమా.. ఛానెల్స్ కోసం నెలకు కనీసం 200 నుండి 300 రూపాయలు ఖర్చు చేస్తుంటారా... అలాగే మీరు OTT లేదా HD ఛానెల్స్ సర్వీస్ ఇవన్నీ కలుపుకుంటే, మీ ఖర్చు 600 నుండి 1000 రూపాయలకు ఉంటుందా.... అయితే ఇవన్నీ మీకు నెలకు కేవలం 61 రూపాయలకే వస్తాయి అని చెబితే..? అస్సలు ఊహించలేరు కదా.... కానీ BSNL అందించే ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా మీరు వీటిని పొందవచ్చు. 61 రూపాయలకే 1000 ఛానెల్స్ అందించే ఈ ప్లాన్ గురించి మీకోసం.......
iFTV లేదా BiTV అంటే ఏమిటి: ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టీవీ(iFTV) లేదా భారత్ ఇంటర్నెట్ టీవీ(BiTV) అనేది BSNL డిజిటల్ టీవీ అండ్ OTT సర్వీస్. ఈ సర్వీస్ హిందీ, ఇంగ్లీష్ ఇంకా ప్రాంతీయ భాషల ఛానెల్‌లతో సహా 500కి పైగా SD ఇంకా HD ఛానెల్స్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ OTT కంటెంట్ కూడా చూడొచ్చు. ప్రత్యేకత ఎంటంటే ఈ ప్లాన్ ప్రారంభ ధర కేవలం రూ.61 మాత్రమే. BSNL స్వయంగా ఈ సమాచారాన్ని ఇచ్చింది.
ALSO READ : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్
సర్వీస్ ఎలా ప్రారంభించాలంటే: ఈ సర్వీస్ ఎలా యాక్టివేట్ చేయాలో కూడా BSNL తెలిపింది. దీని కోసం మీరు ముందుగా WhatsApp ద్వారా 18004444 నంబరుకు "Hi" అని టైప్ చేసి పంపాలి, తరువాత ఇచ్చిన మెను నుండి "Activate IFTV"ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
iFTVని ఉపయోగించడానికి కస్టమర్లకి BSNL భారత్ ఫైబర్ (FTTH) కనెక్షన్ ఉండాలి, ఎందుకంటే ఈ సర్వీస్ ఆ నెట్‌వర్క్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఇంకా యాక్టివ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉండాలి. IFTVకి స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ లేదా ఫైర్ స్టిక్ ఉండాలి. ఎందుకంటే ఈ సర్వీస్ యాక్టివేట్ చేసిన తర్వాత కస్టమర్లకు ప్రత్యేక సెట్-టాప్ బాక్స్ లాంటిది ఉండదు. ఇందుకు కస్టమర్లు వాళ్ళ టీవీలో స్కైప్రో లేదా ప్లేబాక్స్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తరువాత FTTH నంబర్‌ను ఉపయోగించి ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఈ సర్వీస్ BSNL నెట్‌వర్క్‌తో మాత్రమే పనిచేస్తుంది.