ఇంటర్ సర్కారీ లెక్చరర్లకు డిప్యుటేషన్లు

ఇంటర్ సర్కారీ లెక్చరర్లకు డిప్యుటేషన్లు
  •     ఖాళీలున్న చోట మూడు రోజులు బోధించాలని ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీ పోస్టులకు డిప్యుటేషన్ పద్ధతిలో లెక్చరర్లను అధికారులు సమకూర్చుతున్నారు. దీనికోసం జిల్లాల్లోని పోస్టులకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా ప్రస్తుతం పనిచేస్తున్న చోట మూడు రోజులు.. డిప్యుటేషన్ వేసిన చోట మరో మూడు రోజులు పాఠాలు బోధించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త కాలేజీలు ఉండగా, అందులో ఏడు కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పోస్టులను సాంక్షన్ చేసింది. మిగిలిన 18 కాలేజీల్లో పోస్టులకు కేబినెట్ ఆమోదం కోసం పెండింగ్​లో ఉంచినట్టు సమాచారం. ఇటీవల శాంతికుమారి కమిటీ సమయంలోనూ ఆయా పోస్టుల్లో గెస్టు ఫ్యాకల్టీని తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇంటర్ కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ దానికి అనుమతి ఇవ్వలేదు. ముందే తీసుకుంటే.. జీతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో డిప్యుటేషన్ పై లెక్చరర్లను తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం సరికాదని వెంటనే గెస్టు ఫ్యాకల్టీని నియమించాలని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.