హైదరాబాద్ కూకట్ పల్లిలోని అపార్ట్ మెంట్ లోకి చొరబడ్డ దుండగులు రూ.3 కోట్లు ఇవ్వాలని ... లేకపోతే చంపేస్తామంటూ ఫ్లాట్ లో ఉన్న వాళ్లను బెదిరించారు.
డిసెంబర్ 27న ఉదయం కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మెరీనా స్కైస్ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్‌లోకి చొరబడి కొందరు దుండగులు ఓ వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ ఐదుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు డిమాండ్ చేస్తూ బాధితుడి తమ్ముడికి ఫోన్ చేయించి నగదు తెప్పించేందుకు ప్రయత్నించారు.
అయితే బాధితుడి తమ్ముడు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను సంప్రదించాడు.దీంతో పోలీసులు వచ్చే లోపే బాధితుడిని ఫ్లాట్ నుంచి గేట్ వరకు తీసుకొచ్చారు దుండగులు. అయితే అదే సమయంలో పోలీసులు గేట్ దగ్గరకు రాగానే పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఐదుగురిలో ముగ్గురు పారిపోగా నరసింహ రాజు, రవీంద్రబాబు అనే ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లాట్ లోకి చొరబడ్డ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
