మేడారం ఏడో రోజు ఆదాయం రూ.61.16 లక్షలు.. ఇప్పటివరకు మొత్తం రూ.13.25 కోట్లు

మేడారం ఏడో రోజు ఆదాయం రూ.61.16 లక్షలు.. ఇప్పటివరకు మొత్తం రూ.13.25 కోట్లు

వరంగల్‍, వెలుగు : మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హండీల ద్వారా వచ్చిన కానుకల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో కొనసాగుతోంది. ఏడోరోజైన బుధవారం రూ. 61.16 లక్షల ఆదాయం వచ్చింది. తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన 40 హుండీలతో కలిపి మొత్తం 828 హుండీలను తెరిచారు. బుధవారం ఫారిన్‌‌ కరెన్సీ, చిల్లర నాణేలను లెక్కించారు. ఇప్పటివరకు మొత్తం రూ.13,25,83,269 ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు. గురువారంతో హుండీల లెక్కింపు ముగియనుంది.