సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 27న సినిమా రిలీజ్ కానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు రైటర్, నిర్మాత కోన వెంకట్, దర్శకులు సముద్ర, వి.ఎన్ ఆదిత్య, నిర్మాత రామ సత్య నారాయణ, రఘు కుంచె అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ఈ కథ చాలా నచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫాదర్అండ్ సన్ ఎమోషన్‌తో సాగే ఈ మూవీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని చెప్పాడు.
హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘ఇది నాకు తొలి చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సతీష్ గారికి థ్యాంక్స్. మా హీరో సాయి గారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. రైటర్ లక్ష్మీ భూపాల, లిరిసిస్ట్ భాస్కరభట్ల, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత శోభా రాణి, మ్యూజిక్ డైరెక్టర్ రిషి కార్యక్రమంలో పాల్గొన్నారు.
