విజయ్, శీతల్ భట్ జంటగా ప్రభు సూర్య దర్శకత్వంలో రేణుక శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘అలా జరిగిన కథ’. ‘చిత్రం’ శ్రీను, రవి వర్మ, శివ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించింది టీమ్.
ఈ సందర్భంగా నటుడు ‘చిత్రం’ శ్రీను మాట్లాడుతూ ‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాకు సంబంధించి కొన్ని బాధ్యతలు నాకు అప్పగించినప్పుడు నేను కొంతమంది నటీనటులతో, టెక్నీషియన్స్‌తో మాట్లాడాను. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది’ అని చెప్పాడు.
‘అలా జరిగిన కథ’తో అందరూ కనెక్ట్ అవుతారని హీరో విజయ్ అన్నాడు. టీమ్ అందరి సపోర్ట్‌తో మంచి అవుట్‌పుట్ వచ్చిందని దర్శకుడు ప్రభు సూర్య చెప్పాడు. ఇందులోని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాత రేణుక శ్రీనివాస్ అన్నారు. నటులు రవి వర్మ, జబర్దస్త్ రాజమౌళి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
