కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ

కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ ఏర్పాటుకు  దరఖాస్తుల స్వీకరణ
  •     20 నుంచి 25 శాతం మహిళలకు ప్రాధాన్యం 
  •     కాంగ్రెస్​ వికారాబాద్​ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్

వికారాబాద్, వెలుగు  : కాంగ్రెస్ పార్టీ వికారాబాద్​ జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నెల 3,4 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్​డీసీసీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ కోరారు. శుక్రవారం వికారాబాద్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇంట్లో జిల్లా అబ్జర్వర్లు వినోద్ రెడ్డి, నరేందర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనవరి 3న తాండూరు, వికారాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య లీడర్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, 4న కొడంగల్, పరిగి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, చెప్పారు. వచ్చిన దరఖాస్తులను టీపీసీసీకి పంపిస్తామని చెప్పారు. కార్యవర్గ నియామకంలో 20 నుంచి 25 శాతం మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

కార్యవర్గంలో వివిధ హోదాల్లో కలిపి 15 మంది ఉంటారన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్​రెడ్డి, కాంగ్రెస్​ లీడర్లు వి.సత్యనారాయణ, ఎన్​.కిషన్ నాయక్, చిగుళ్ల పల్లి రమేశ్, పి.శ్రీనివాస్​, బక్క యాదగిరి, గురువా రెడ్డి,రెడ్యా నాయక్ ఉన్నారు. కాగా, స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి గడ్డం శైలజ ఐదో వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్​సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందున్న విగ్రహానికి పలువురు కాంగ్రెస్​లీడర్లు నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో దవాఖానాల్లో పండ్లు పంపిణీ చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్​రెడ్డి పాల్గొన్నారు.