- పరిగి 13 వార్డులో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ఏజెంట్ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్సే బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ఫిర్యాదు చేసింది. దీంతో రెండు పార్టీల లీడర్లు పోలింగ్‌స్టేషన్ గేటును తోసి లోపలకు చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు వర్గాలకు బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఎస్సై మోహన్‌కృష్ణతో వాగ్వాదానికి దిగారు.
- షాద్ నగర్ పదో వార్డులో పోలింగ్‌కేంద్రం దగ్గర ఓట్లడిగే విషయంలో కాంగ్రెస్ లీడర్జమ్రద్ ఖాన్ వర్గం, బీఆర్ఎస్ లీడర్పిల్లి శేఖర్ వర్గం మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు వారిని అక్కడినుంచి చెదరగొట్టారు.
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లోని 13 మున్సిపాల్స్థానాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో 1,76,023 మంది ఓటర్లుండగా 1,39,044 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ జిల్లాలో 78.99 శాతం పోలింగ్ నమోదు కాగా, పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఓట్లేశారు. 87,478 మంది పురుషులు, 88,542 మంది మహిళలు ఉండగా.. 68,725 మంది పురుషులు, 70,318 మంది మహిళలు ఓటేశారు. పురుషుల పోలింగ్‌శాతం78.56, కాగా.. మహిళలది 79.42 శాతం కావడం విశేషం.
ఉదయం 9 గంటలకు 11.74 శాతం ఉన్న పోలింగ్, 11 గంటలకు 30.11 శాతం, 1 గంటకు 52.57 శాతానికి చేరింది. 3 గంటలకు 68.77 శాతం నమోదు కాగా.. సాయంత్రం 5 గంటలకు 78.52 శాతం దాటింది. 5 గంటల కల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకొని లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో 78.99 శాతం నమోదైంది. అత్యధికంగా ఆమనగల్ మున్సిపాలిటీలోలో 84.8 శాతం, అత్యల్పంగా షాద్ నగర్లో 76.24 శాతం పోలింగ్ అయ్యింది. చేవెళ్లలో 81.44 శాతం, మొయినాబాద్‌లో 80.24 శాతం, ఇబ్రహీంపట్నంలో 78.45 శాతం, శంకర్ పల్లిలో 77.09 శాతం పోలింగ్ నమోదైంది. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చేవెళ్ల మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
వికారాబాద్ జిల్లాలో 71.82 శాతం
వికారాబాద్/పరిగి: వికారాబాద్‌జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్‌లో ఎన్నికలు జరగ్గా 71.82 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని చోట్లా కలిపి 100 వార్డులుండగా, ఇప్పటికే వికారాబాద్‌లోని రెండు వార్డుల్లో కాంగ్రెస్అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నాలుగు మున్సిపాలిటీల్లో 1,7,379 మంది ఓటర్లుండగా 1,22,360 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లేసిన వారిలో పురుషులు 60,485 మంది , మహిళలు 61,847 మంది, ఇతరులు 28 మంది ఉన్నారు. 9 గంటలకు వరకు 11.15 శాతం, 11 గంటల వరకు 29.03 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.93 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 62.79 శాతం పోలింగ్..టైం ముగిసే సమయానికి 71.82 శాతం పోలింగ్ నమోదైంది.
వికారాబాద్ లో 32 వార్డులుండగా, 40,287 మంది ఓటేశారు. మొత్తంగా 74.35 శాతం పోలింగ్ నమోదైంది. తాండూర్‌లో 36 వార్డుల్లో 77,029 మంది ఓటర్లుంటే 52,025 మంది ఓటేశారు. తాండూరులో 67.54 శాతం పోలింగ్ నమోదైంది. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులు..27,600 ఓటర్లుండగా, 21,280 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిగిలో 77.10 శాతం పోలింగ్ నమోదైంది. కొడంగల్‌లో 12 వార్డుల్లో 11,565 ఓటర్లుండగా, 8,769 మంది ఓటేశారు. కొండగల్‌లో 75,81శాతం పోలింగ్‌నమోదైంది. ఓటింగ్ సరళిని కలెక్టర్ ప్రతీక్ జైన్వెబ్క్యాస్టింగ్ద్వారా పర్యవేక్షించారు. ఎస్పీ స్నేహా మెహ్రా బందోబస్తు పర్యవేక్షించారు. షాద్ నగర్ లోని 1,12,13 వ వార్డులను డీసీపీ శిరీషతో కలిసి ఫ్యూచర్ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు.
మేడ్చల్లో 83.99 పోలింగ్
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ జిల్లాలో అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో 83.99 పోలింగ్ నమోదైంది. ఎల్లంపేట్ లో 83.27, అలియాబాద్ లో 79.62, మూడు చింతలపల్లిలో 89.07 శాతం నమోదైంది. మూడు మున్సిపాలిటీలలో మంగళవారం రాత్రి బుధవారం ఉదయం చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
