సీపీఐ నూరో వార్షికోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చండూరు మండలం గుండ్లపల్లిలో రోడ్డు వద్ద కామ్రేడ్ మందడి నర్సింహారెడ్డి స్తూపం వద్ద సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామలింగయ్య జెండావిష్కరణ చేశారు. గుండ్రాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ బోడిగే సైదులు జెండావిష్కరించారు. హుజూర్ నగర్లో సీపీఐ రాష్ర్ట కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్ ఆధ్వర్యంలో లీడర్లు జెండా ఆవిష్కరణ చేశారు. నార్కట్‌పల్లిలో జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో జెండావిష్కరించారు. దేవరకొండ పార్టీ ఆఫీస్‌లో సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది ఎర్రజెండా పార్టీయేనని, పార్టీ తరఫున పోరాటాలను వివరించారు.- చండూరు/ చిట్యాల/ హుజూర్ నగర్/ యాదాద్రి/ నార్కట్‌పల్లి/ దేవరకొండ, వెలుగు
