
జీఎస్టీ రేట్ల మరో మూడు రోజుల్లో తగ్గబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్లాబ్ రేట్లకు అనుగుణంగా సెప్టెంబర్ 22 నుంచి కంపెనీలు తమ ప్యాసింజెర్ వాహనాల రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద ఆటో సంస్థ మారుతీ సుజుకీ తన స్విఫ్ట్, డిజైర్, బ్యాలినో, ఫ్రాన్క్స్, బ్రెజా సహా ఇతర మోడళ్ల రేట్లను భారీగా తగ్గించింది. దీంతో కొనుగోలుదారులు అత్యధికంగా రూ.లక్ష 29వేల వరకు డబ్బు ఆదా చేసుకుంటారని కంపెనీ వెల్లడించింది.
భారత ప్రభుత్వం తెస్తున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు బెనిఫిట్స్ పూర్తిగా కొనుగోలుదారులకు పాసాన్ చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. కంపెనీ ప్రస్తుతం తన కార్లను మార్కెట్లో రెండు చానళ్ల ద్వారా అమ్ముతోంది. ఎరీనా కింద ఆల్టో, ఎస్ ప్రెసో, వ్యాగనార్, సెలీరియో, ఇఎకో, స్విఫ్ట్స డిజైట్, బ్యాలినో, ఎర్టిగా వాహనాలు ఉమ్ముతోంది. అలాగే నెక్సా షోరూంలలో ఇగ్నైస్, బ్యాలినో, ఫ్రాన్ఎక్స్, జిమ్మీ, గ్రాండ్ వితారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో లను అమ్ముతోంది.
ALSO READ : రూ.61కే 1000 ఛానెల్స్, సూపర్ ఆఫర్..
లక్షకు పైన రేట్లు తగ్గిన మోడాల్స్ వివరాలు..
* S-Presso రేటు రూ.లక్ష 29వేలు తగ్గటంతో రూ.3లక్షల 49వేలకే అందుబాటులో ఉంది.
* Alto K10 రేటు లక్ష 7వేలు తగ్గటంతో స్టార్టింగ్ మోడల్ ధర రూ.3లక్షల 69వేలుగా ఉంది.
* Brezza మోడల్ కార్ల రేటును కంపెనీ లక్ష 12వేల రూపాయలు తగ్గించింది.
* Fronx కార్ల ధరను మారుతీ సుజుకీ లక్ష 12వేల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
* Grand Vitara కార్ల రేటును కంపెనీ రూ.లక్ష 7వేలు తగ్గించేసింది.
ఎంట్రీలెవెల్ నుంచి వివిధ మోడళ్లపై తగ్గించబడిన రేట్లు..
* Celerio కార్ల రేటు రూ.94వేల 100 తగ్గించబడింది.
* WagonR మోడల్ కార్ల రేటును రూ.80వేల మేర తగ్గించింది మారుతీ సుజుకీ.
* Swift కార్ల రేటు రూ.84వేల 600 తగ్గిన తర్వాత రూ.5లక్షల 78వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
* Baleno మోడల్ రేటు రూ.86వేల 100 తగ్గిన తర్వాత రూ.5లక్షల 98వేల నుంచి మెుదలవుతున్నాయి.
* Dzire మోడల్ కార్లు రూ.87వేల 700 తగ్గాక రూ.6లక్షల 23వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
* Ignis కార్ల రేటు రూ.71వేల 300 తగ్గించిన తర్వాత రూ.5లక్షల 35వేల నుంచి ప్రారంభమౌతున్నాయి.
* మారుతీ తన Eeco రేటును రూ.68వేలు తగ్గించి రూ.5లక్షల 18వేల నుంచి అందుబాటులో ఉంచింది.
* Ertiga కార్ల రేటు రూ.46వేల 400 తగ్గి రూ.8లక్షల 80వేలతో స్టార్ట్ అవుతున్నాయి.
* XL6 మోడల్ కార్ల రేటు రూ.52వేల తగ్గించబడిన తర్వాత రూ.11లక్షల 52వేల నుంచి మెుదలవుతున్నాయి.
* ఇక చివరిగా మారుతీ తన Invicto రేటును రూ.61వేల 700 తగ్గించటంతో రూ.24లక్షల 97వేల నుంచి కార్ రేటు స్టార్ట్ అవుతోంది.