ఫోటోగ్రఫీలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఫోటోగ్రఫీలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఉద్యోగాల కల్పనకు కార్మికశాఖ పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం  (సెప్టెంబర్ 19) హైదరాబాద్ నార్సింగిలో తెలంగాణ ఫోటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్యవర్రయంలో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో-2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

మూడు రోజుల పాటు జరగనున్న ఫోటో ఎక్స్ పో ప్రారంభోత్సవ ఉపన్యాసాన్ని ఇచ్చిన మంత్రి.. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీలోనూ ఉద్యోగాల కల్పనలకు కృష్టి చేస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఫోటో గ్రఫీ భవన్ కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి  వివేక్. 

విద్య, ఉద్యోగాల కల్పనలో తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ కాలేజీలు పనిచేస్తున్నాయని చెప్పిన మంత్రి.. 75 శాతం మార్కులు వచ్చిన వారికి ఉచిత సీట్లు ఇస్తున్నట్లు తెలిపారు.