
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఈ హారర్ మిస్టరీ మూవీ సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా వారం రోజులు కంప్లీట్ చేసుకోవడంతో గురువారం (సెప్టెంబర్ 18న) సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్.
ఇవాళ (సెప్టెంబర్ 19) నుంచి కిష్కింధపురి సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠరేపే మౌత్ టాక్తో రోజురోజుకూ, కిష్కింధపూరిపై ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో మిస్టరీ థ్రిల్లర్ని థియేటర్లలోనే చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ‘ఇలాంటి సినిమాలు థియేటర్స్లో చూస్తేనే.. భలే కిక్ ఉంటుంది. సో ఈ హర్రర్ మిస్టరీని ఏ మాత్రం మిస్ అవ్వకండని’ సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఈ సినిమాలో 'రాఘవ' పాత్రలో సినిమానంతా తన భుజాలపై నడిపించాడు బెల్లంకొండ శ్రీనివాస్. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మైథిలి పాత్రలో అనుపమ ఆకట్టుకుంది. ముఖ్యంగా దెయ్యం ఆవహించిన సీన్స్‌లో భయపెట్టింది. లియో, కొత్త లోక చిత్రాల తర్వాత శాండీ మాస్టర్ మరోసారి ఈ సినిమాతో తన విలనిజాన్ని పండించి సర్‌ప్రైజ్ చేశాడు.
‘కిష్కింధపురి’ వసూళ్లు:
సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నిలకడ వసూళ్లతో రాణిస్తుంది. మొదటి రోజు కంటే (రూ.2.15 కోట్ల నెట్), రెండో రోజు (రూ.2.5 కోట్లు), రెండో రోజు కంటే మూడో రోజు(రూ.2.9 కోట్లు). ఇలా మరింత బజ్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మొదటి మూడు రోజులు రెట్టింపు కలెక్షన్లు సాధించి సత్తా చాటుకుంది.
ఆ తర్వాత రోజుకో కోటి చొప్పున.. మొత్తం 7 రోజుల్లో రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇండియా గ్రాస్ (రూ.14 కోట్లు + ఓవర్సీస్ (రూ.2.5 కోట్లు) వసూళ్లు కలుపుకొని.. మొత్తం వరల్డ్ వైడ్ రూ.16.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇంకా ఈ చిత్రం రూ.8 కోట్ల వరకు వసూల్ చేస్తే సేఫ్ జోన్ లోకి రానుంది.
అయితే, కిష్కిందపురి మూవీకి ప్రమోషన్తో కలుపుకుని మొత్తం రూ.12 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ బరిలో నిలిచింది. ఫస్ట్ వీకెండ్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ వీక్ ఎలాంటి వసూళ్లు రాబట్టనుందో అనే ఆసక్తి నెలకొంది.
ఈవెంట్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే?
ఈ సక్సెస్ ఈవెంట్కి హీరో సాయి దుర్గ తేజ్, దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా హాజరయ్యారు. వరుస విజయాలతో ఈనెల సక్సెస్‌ఫుల్ సెప్టెంబర్‌గా నిలిచిందని, థియేటర్స్‌లో ఒక చిన్న ఫెస్టివల్‌లా ఉందని, ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని అతిథులంతా ఆకాంక్షించారు.
ఈ సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్‌గా భావిస్తున్నానని హీరో సాయి దుర్గ తేజ్ అన్నాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు సాయి శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పాడు. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్ అన్నాడు దర్శకుడు కౌశిక్.
ఆడియెన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోందని, ఒక నిర్మాతగా ఇది తనకు చాలా ఆనందాన్ని ఇస్తోందని సాహు గారపాటి అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కిష్కిందపురి కథ:
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్‌లను చూపించే గైడ్స్. ఔత్సాహికులను పాడుబడ్డ భవనాల్లోకి తీసుకెళ్లి అక్కడి దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పి వాళ్లను భయపెట్టడమే వీళ్ల ప్రొఫెషన్. అలా ఓసారి సువర్ణమాయ అనే మూతపడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు ఎనిమిది మంది ఔత్సాహికులు వస్తారు. కానీ ఈసారి అక్కడ నిజమైన దెయ్యం ఎదురుపడుతుంది.
రేడియోలోని వాయిస్‌తో వాళ్లను భయపెడుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతారు. కానీ ఆ దెయ్యం వార్నింగ్ ఇచ్చినట్టుగానే అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కక్కరూ చనిపోతుంటారు. ఇంతకూ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? తన గతం ఏమిటి? ఎందుకలా చంపుతోంది? దాని బారి నుంచి మిగతా వాళ్లను కాపాడటానికి రాఘవ్ ఏం చేశాడనేదే మిగతా కథ.