హైదరాబాద్ లో మూవీ లవర్స్ కి ఫేవరెట్ స్పాట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యింది. 30 ఏళ్ళ కిందట మూతపడ్డ ఒడియన్ థియేటర్ ఇప్పుడు ఒడియన్ ఐనాక్స్ మాల్ గా మళ్ళీ ప్రారంభమయ్యింది. బుధవారం ( ఫిబ్రవరి 4 ) ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ థియేటర్ ని ప్రారంభించారు. 8 స్క్రీన్లు ఉన్న ఈ థియేటర్ ఓపెన్ అవ్వడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పాలి.
ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని పాత సుదర్శన్ 70MM స్థానంలో మహేష్ బాబు AMB సినిమాస్ కూడా 7 స్క్రీన్లతో త్వరలోనే ప్రారంభం కానుంది.మల్టీప్లెక్స్ ట్రెండ్ పెరిగిపోవడంతో క్రమంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడుతూ వస్తున్నాయి. అయితే.. ఒడియన్ లాంటి పాత థియేటర్ మల్టీప్లెక్స్ గా పునః ప్రారంభం అవ్వడం పట్ల మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం రాత్రి సెకండ్ షోలతో ప్రారంభమైన ఐనాక్స్ ఒడియన్ మాల్ లో 8 స్క్రీన్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో కూడా ఒడియన్ మాల్ అందుబాటులో ఉంది. సో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇప్పుడున్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తో పాటు కొత్త మల్టీప్లెక్స్ కూడా వచ్చేసింద.. మరి, ఐనాక్స్ ఒడియన్ మాల్ ని మూవీ లవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
