
రెస్టారెంట్ కు వెళ్లి వేడి వేడిగా.. కారంగా.. ఘాటుగా.. అందులోనూ రైస్ ఐటమ్ తినాలంటే.. ఠక్కున గుర్తుకొచ్చేది షెజ్ వాన్ ఫ్రైడ్ రైస్. యమ్మీ యమ్మీగా ఉండే షెజ్ వాన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అలాంటిది మరి. రెగ్యులర్ గా రెస్టారెంట్ కు వెళ్లి తినాలంటే సాధ్యం కాదు కదా.. అందుకే మరి.. రెస్టారెంట్ స్టయిల్ లో.. యమ్మీ యమ్మీగా షెజ్ వాన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరంగా చెబుతాం.. వీకెండ్ టైంలో ఘుమ ఘుమలాడే షెజ్ వాన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి..
కావాల్సినవి:
షెజ్ వాన్ సాస్: మూడు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు : ఒక టీ స్పూన్
ఆకుకూరల తరుగు: రెండు టేబుల్ స్పూన్లు (ఏ ఆకులైనా సరే)
కూరగాయల తరుగు (పుట్టగొడుగులు, బీన్స్, క్యారెట్, మొక్కజొన్న గింజలు, పచ్చి బఠాణీలు లాంటివి) – అన్నీ కలిపి ఒక కప్పు
పనీర్ ముక్కలు: పావు కప్పు (కావాలంటే)
వండిన అన్నం: రెండు కప్పులు
సోయా సాస్: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : రుచికి సరిపడా
ఉల్లికాడ తరుగు: ఒక టీ స్పూన్ను
వ్వులు: పావు టీ స్పూన్ (కావాలంటే)
నూనె: సరిపడా
తయారీ:స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆకుకూరలు తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. నిమిషం తర్వాత కూరగాయల తరుగు, కొద్దిగా ఉప్పు, పనీర్ ముక్కలు వేయాలి. మూడు నిమిషాలు పెద్ద మంటపై వేగించాలి. అందులో షెజ్ వాన్ సాస్, సోయా సాస్, మిరియాల పొడి వేయాలి. తర్వాత అన్నం వేసి కలపాలి. మళ్లీ పై నుంచి సాస్లు చల్లి రెండు నిమిషాలు వేగించాలి. చివరగా నువ్వులు, ఉల్లికాడ తరుగు వేస్తే సూపర్ షెజ్ వాన్ రైస్ రెడీ.