మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి

మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి
  • దేవాదాయ, చేనేత, జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం చెర్వుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌళి శాఖల ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి సోమవారం చెర్వుగడ్డ జడల రామలింగేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఇతర ఆఫీసర్లతో ఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో 20 నుంచి 30 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెర్వుగట్టు ఆలయం వద్ద ఇకపై చేపట్టే ప్రతి పని మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే జరుగుతుందని చెప్పారు. అనంతరం కల్యాణమండపం, కోనేరు, మెట్ల దారి, కాలభైరవ, ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి, స్థపతి వళ్లీనాయకం, ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణమూర్తి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, దేవాదాయ శాఖ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఓంప్రకాశ్‌‌‌‌‌‌‌‌, ఈఈ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌శర్మ పాల్గొన్నారు.