
న్యూఢిల్లీ: వరుసగా పెరుగుతూ సమాన్యులకు అందని దూరం వెళ్తున్న బంగారం.. ఒక్కసారిగా భారీగా తగ్గింది. బుధవారం (సెప్టెంబర్ 17) గోల్డ్ రేట్లు రూ.1,300 తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయానికి ముందుపెట్టుబడిదారులు లాభాలు బుక్ చేసుకోవడంతో ధరలు పడ్డాయి.
99.5శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,800కి దిగివచ్చింది. అంతకు ముందు రోజు జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,15,100కి చేరింది.
ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్లు అంచనా వేస్తున్నాయని, ఈ ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్త వహించడం వల్ల బంగారం ధరలు తగ్గాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
వెండి ధర కూడా రూ.1,670 తగ్గి రూ.1,31,200గా నమోదైంది.