
Gold Price Today: అందరూ అనుకున్నట్లుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించటంతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్తేజం నిండింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఈ రేట్ల తగ్గింపులు ఊతం ఇవ్వొచ్చని నిపుణుల అంచనాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే విలువైన లోహాలు గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా దసరాకి కొద్ది రోజుల ముందు వరుసగా తగ్గుతూ షాపింగ్ చేసే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు రెండు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లను తప్పక పరిశీలించటం ముఖ్యం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 17తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 18న రూ.540 తగ్గుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.54 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 18న):
హైదరాదాబాదులో రూ.11వేల 117
కరీంనగర్ లో రూ.11వేల 117
ఖమ్మంలో రూ.11వేల 117
నిజామాబాద్ లో రూ.11వేల 117
విజయవాడలో రూ.11వేల 117
కడపలో రూ.11వేల 117
విశాఖలో రూ.11వేల 117
నెల్లూరు రూ.11వేల117
తిరుపతిలో రూ.11వేల 117
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 17తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 18న 10 గ్రాములకు రూ.500 తగ్గింది. దీంతో గురువారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 18న):
హైదరాదాబాదులో రూ.10వేల 190
కరీంనగర్ లో రూ.10వేల 190
ఖమ్మంలో రూ.10వేల 190
నిజామాబాద్ లో రూ.10వేల 190
విజయవాడలో రూ.10వేల 190
కడపలో రూ.10వేల 190
విశాఖలో రూ.10వేల 190
నెల్లూరు రూ.10వేల 190
తిరుపతిలో రూ.10వేల 190
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ పతనాన్ని కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 18న కేజీకి వెండి సెప్టెంబర్ 17తో పోల్చితే రూ.వెయ్యి తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 41వేలకు తగ్గింది. అంటే గ్రాము వెండి రేటు రూ.141 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.