
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 22.
పోస్టుల సంఖ్య: 160 (టెక్నికల్ ఆఫీసర్ సి) అన్ రిజర్వ్డ్ 65, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 43, ఎస్సీ 24, ఎస్టీ 12.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఈసీఈ/ ఈటీసీ/ ఈ అండ్ ఐ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ సీఎస్ఈ/ ఐటీ/ మెకానికల్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 16.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బి.టెక్/ బీఈలో సాధించిన మార్కులకు 20 శాతం, వర్క్ ఎక్స్పీరియన్స్కు 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది.
శాలరీ: మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.25,000, రెండో సంవత్సరం ప్రతి నెలా రూ. 28,000, మూడో, నాలుగో సంవత్సరం ప్రతి నెలా రూ.31,000 చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.