Gold Price Today: అంతర్జాతీయంగా రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు విలువైన లోహాల రేట్లను అమాంతం పెంచేస్తున్నాయి. పండక్కి కాసు బంగారం కొందాం.. కనీసం పట్టీలైనా కొనుక్కుందాం అనుకుంటున్న మధ్యతరగతి భారతీయులకు రేట్ల షాక్ తగులుతోంది. చాలా మంది పండగ నాటికి కొంత రేట్ల పతనం కనిపిస్తుందని ఆశించినప్పటికీ.. ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు. అయితే రిటైల్ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ ప్రాంతంలో తాజా పెరిగిన రేట్లను గమనించండి ముందుగా.
ALSO READ : టాటా కొత్త పంచ్ ఇదే.. ధర ఎంతంటే..?
జనవరి 14 భోగి పండుగ రోజున కూడా బంగారం రేట్లు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.109 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 362గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 165గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : అమర రాజా కొత్త సీహెచ్ఆర్ఓ శిల్ప
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ అదే దూకుడుతో కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే బుధవారం జనవరి 14, 2025న వెండి రేటు కేజీకి రూ.15వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 07వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.307 వద్ద ఉంది.
