టాటా మోటార్స్ సరికొత్త పంచ్ ఎస్‌యూవీని రూ.5.59 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్, మాన్యువల్/ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఎన్సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
ఈ కారులో ఏడు అంగుళాల హర్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ వంటి సౌకర్యాలూ ఉన్నాయి.
