హైదరాబాద్, వెలుగు: బ్యాటరీలు తయారు చేసే హైదరాబాద్ సంస్థ అమర రాజా గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్గా (సీహెచ్ఆర్ఓ) శిల్పా కాబ్రా మహేశ్వరి నియమితులయ్యారు. 20 ఏళ్లు పాటు సేవలందించిన జయకృష్ణ పదవీ విరమణ చేయడంతో ఆమె ఆ బాధ్యతలు చేపట్టారు.
శిల్పాకు హెచ్ఆర్ నాయకత్వంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఆమె సీమెన్స్లో పనిచేశారు. రెండు బిలియన్ డాలర్ల విలువైన అమర రాజా గ్రూప్ 65 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 21 వేల మంది పనిచేస్తున్నారు.
