BBL 2025-26: పాక్ పేసర్ సంచలన బౌలింగ్.. చివరి ఓవర్‌లో 6 పరుగులు డిఫెండ్ చేశాడు.. వీడియో వైరల్

BBL 2025-26: పాక్ పేసర్ సంచలన బౌలింగ్.. చివరి ఓవర్‌లో 6 పరుగులు డిఫెండ్ చేశాడు.. వీడియో వైరల్

పాకిస్థాన్ క్రికెటర్లు ప్రస్థుహం బిగ్ బాష్ లీగ్ లో ఆడుతూ బిజీగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ప్రాక్టీస్ గా బిగ్ బాష్ లీగ్ ఆడి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారు. అయితే టోర్నమెంట్ లో పాక్ ప్లేయర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. బాబర్, రిజ్వాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ మాత్రం అద్భుతంగా రాణించి మ్యాచ్ గెలుపుకు కారణమయ్యాడు. చివరి ఓవర్ లో ప్రత్యర్థి జట్టు 6 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి 3 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.    

బుధవారం (జనవరి 12) హోబర్ట్ హరికేన్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. 161 పరుగుల టార్గెట్ లో హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో విజయానికి చివరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బంతి తీసుకున్న జమాన్ ఖాన్ తన పదునైన యార్కర్లతో తొలి నాలుగు బంతులకు కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతికి వికెట్ తీయడంతో చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన వచ్చింది. చివరి బంతికి ఒక పరుగు రావడంతో 3 పరుగుల తేడాతో బ్రిస్బేన్ విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ 32 బంతుల్లో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మాట్ రెన్షా 37 పరుగులతో రాణించాడు. హోబర్ట్ బౌలర్లలో రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టాడు. రిషద్ హుస్సేన్, నాథన్ ఎల్లిస్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 161 పరుగుల లక్ష్య ఛేదనలో హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఓడిపోయింది. బ్యూ వెబ్‌స్టర్(51) బెన్ మెక్‌డెర్మాట్ (59) హాఫ్ సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది.