IND vs NZ: ఒంటరి పోరాటంతో వీరోచిత సెంచరీ.. టీమిండియా దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన రాహుల్

IND vs NZ: ఒంటరి పోరాటంతో వీరోచిత సెంచరీ.. టీమిండియా దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన రాహుల్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ ఒంటరి పోరాటం చేసి భారీ స్కోర్ అందించాడు. వీరోచిత సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 92 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేఎల్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ సెంచరీతో రాహుల్ టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. 

రాహుల్ వన్డే కెరీర్ లో ఇది 8వ సెంచరీ. మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ కేవలం 93 మ్యాచ్ ల్లోనే 8 సెంచరీలు పూర్తి చేయడం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 7 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో రాహుల్ ఈ దిగ్గజ క్రికెటర్ ను వెనక్కి నెట్టాడు. శ్రేయాస్ అయ్యర్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రాహుల్..జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు. జడేజాతో కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో రాహుల్ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఒక వైపు వికెట్లు పడినా మరో ఎండ్ లో రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టు స్కోర్ ను 284 పరుగులకు చేర్చాడు.

రాహుల్ సెంచరీతో ఇండియా భారీ స్కోర్:      

బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. రాహుల్ తో పాటు గిల్ (56) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. రాహుల్ 112 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, జకారీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీనుకున్నారు.