అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం చేతలదాకా పోయేటట్లు కనిపిస్తోంది పరిస్థితులను చూస్తోంది. ఇరాన్ లో ఖమేనీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల్లో యున నిరసనకారుడు ఇర్ఫాన్ సొల్తానీని ఉరితీసేందుకు ఇవాళ డెడ్ లైన్ పెట్టుకోవటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇరాన్ సెక్యూరిటీ బంధీగా ఉన్న ఇర్ఫాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతని పట్ల ప్రభుత్వం తీరుపై తాజా మీడియా కథనాలు ఆందోళనలు పెంచేస్తున్నాయి.
ALSO READ : ఇరాన్- ఘర్షణలకు ఆజ్యం పోస్తున్న ట్రంప్!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఇర్ఫాన్ విషయంలో దర్యాపులు, న్యాయపరమైన అన్ని మార్గాలను ఖమేనీ సర్కార్ నిరాకరించింది. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండానే అతన్ని ఉరితీయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇర్ఫాన్ తన ఫ్యామిలీతో చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు జస్ట్ 10 నిమిషాలు అంటే పది నిమిషాలు మాత్రమే టైం ఇచ్చిందంట ఇరాన్ సర్కార్. మాటల్లేవ్, న్యాయ పోరాటం లేదు ప్రభుత్వం చెప్పినట్లు ఉరితీయటమే ఇక మిగిలి ఉన్నట్లు తాజా న్యూస్ రిపోర్ట్స్ ద్వారా వెల్లడైంది.
ALSO READ : ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీస్తే అంతుచూస్తానంటూ హెచ్చరిక..
జనవరి 8న కర్జా ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఇర్ఫాన్ ను అక్కడి అధికారులు బంధీగా తీసుకున్నారు. దీని తర్వాత కొద్ది రోజులకు అతని ఫ్యామిలీకి దీనిపై సమాచారం అందించారు. అది కూడా అతడికి ఉరిశిక్ష పడిందని రెండు ముక్కలు చెప్పటానికే. అసలు కేసు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, దర్యాప్తు , కోర్టు ప్రొసీడింగ్స్ లాంటి మాటలకు తావు లేకుంగా మీ అబ్బాయిని ఉరితీయబోతున్నాం అంటూ అతని కుటుంబానికి తెలిపారు ఇరాన్ అధికారులు. అయితే చివరిగా ఉరికంభం ఎక్కటానికి ముందు కలవటానికి 10 నిమిషాలు టైం ఇస్తామని చెప్పారు.
ALSO READ : పోలీస్ కారును బాంబులతో పేల్చేశారు
దేవుడితో వైరం పెట్టుకున్నాడు అనే కారణం కింద అతడిని ఉరితీయబోతున్నట్లు వెల్లడైంది. ఇర్ఫాన్ ప్రాణాలు కాపాడేందుకు అతని దగ్గరి బంధువైన ఒక లాయర్ ప్రయత్నించినప్పటికీ ఇరాన్ సెక్యూరిటీ అధికారులు అతడిని బెదిరించి ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా అడ్డుకున్నారని తేలింది. అలాగే ఈ అల్లర్లలో పట్టుబడ్డ నిరసనకారులందరికీ ఇలాగే ఉరిశిక్ష ఉంటుందని కూడా వెల్లడైంది. మెుత్తానికి ఈ పరిస్థితులు అత్యంత భయానకంగా మారటంతో అమెరికా దాడులు ఈరోజో రేపో స్టార్ట్ అవుతాయని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జస్ట్ ట్రంప్ కూడా ఈ ఉరిశిక్ష అమలు కోసమే తన యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచారనే మాటలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి.
