IT Layoffs: TCS అనైతిక లేఆఫ్స్.. లోపల జరుగుతోంది తెలిస్తే షాకే.. విజిల్‌బ్లోయర్ లీక్..

IT Layoffs: TCS అనైతిక లేఆఫ్స్.. లోపల జరుగుతోంది తెలిస్తే షాకే.. విజిల్‌బ్లోయర్ లీక్..

TCS Layoffs: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్. అరె టీసీఎస్ లో జాబ్ కొట్టినం అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లే అన్నంత గౌరవం, గుర్తింపు ఇచ్చేవారు టెక్కీలు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం టాటా గ్రూప్ ఫాలో అవుతున్న పద్దతులు, రతన్ టాటా మరణం తర్వాత కంపెనీ యాజమాన్యంలో వస్తున్న మార్పులు టాటాల సంస్కృతికి పూర్తి భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కంపెనీ భారీ లేఆఫ్స్ ప్రకటించిన తర్వాత లోపల జరుగుతున్న అనైతిక తొలగింపుల గురించి విజిల్‌బ్లోయర్ బయటపెట్టిన విషయాలు రెడ్డిట్ లో అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. 

ప్రస్తుతం టీసీఎస్ కంపెనీ ఒక లిస్ట్ తయారు చేసుకుని దానిలో ఉన్న టెక్కీలను సైలెంట్ గా లేఆఫ్ చేసేస్తోంది. లిస్టులో ఉన్న ఉద్యోగులను టెర్మినేట్ చేస్తున్న కంపెనీ వారికి ఎలాంటి సివరెన్స్ పే కూడా అందించకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని రెడ్డిట్ పోస్టులో వ్యక్తి వెల్లడించారు. తాజాగా చెన్నై ఆఫీసులో ఒక ఉద్యోగిని తమ ఫ్లూయిడిటీ లిస్టులో ఉన్నడంటూ మీటింగ్ రూముకు పిలిచారు. అక్కడ అతని నుంచి ల్యాపీ, అసెట్స్ తీసుకుని బలవంతంగా రిజిగ్నేషన్ లెటర్ ఒకటి అతనితో రాయించింది అక్కడి యాజమాన్యం. తాను నోటీసు పిరియడ్ కూడా చేయటానికి ఇష్టపడటం లేదంటూ బలవంతంగా ఉద్యోగితో రాయించారు అక్కడి హెచ్ఆర్ టీమ్. దీంతో అతడిని వెంటనే జాబ్ నుంచి ఎలాంటి పెర్క్ అందించకుండా టెర్మినేట్ చేశారు. 

టీసీఎస్ హెచ్ఆర్ టీమ్ ఇలాగే అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులను బలవంతంగా రిజైన్ చేయిస్తున్నట్లు రెడ్డిట్ యూజర్ వెల్లడించారు. ఇది పూర్తిగా అనైతికమని, ఉద్యోగిని లేఆఫ్ చేయటానికి ఒక పద్దతి ఉంటుందని దాని కింద అతడు కంపెనీని వీడుతున్నందుకు చెల్లించాల్సిన సివరెన్స్ పే, మెడికల్ ఫెసిలిటీ వంటివి ఉంటాయని కానీ టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ ఇప్పుడు అలాంటివి అస్సలు ఫాలో కావటం లేదని తేలిపోయింది. ఇదే క్రమంలో టీసీఎస్ ఫ్రెషర్లను జాయినింగ్ రోజునే ఇళ్లకు పంపించేసిన ఉదంతాలు కూడా ఉన్నాయని బయటకొచ్చింది. 

ALSO READ : RBI ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

కొన్ని రోజుల కిందట టీసీఎస్ సీఈవో కె కృతివాసన్ 12వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రస్తుతం కంపెనీ అడ్డగోలుగా ఉద్యోగుల తొలగింపులకు తెరలేపినట్లు తెలుస్తోంది. తాము లేఆఫ్ చేయటానికి ఏఐ కారణం కాదని.. స్కిల్ గ్యాప్ అసలు కారణం అంటూ చెప్పారు. అలాంటప్పుడు ఉద్యోగులను అప్ స్కిల్ చేయెుచ్చుగా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే టీసీఎస్ ఒక హిడెన్ అజెండాతో ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించకుండా లేఆఫ్, టెర్మినేషన్ చేయటంపై టెక్కీల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. అలాగే కంపెనీ ఈ ఏడాది తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం బెంచ్ పై 35 రోజులకు మించి ఉంటే రిజైన్ చేయాల్సి ఉంటుందని మెుత్తం బిల్లింగ్ డేస్ ఏడాదికి 225 ఉండాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.