సూర్యగ్రహణం ఎఫెక్ట్ : మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

సూర్యగ్రహణం ఎఫెక్ట్ :  మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

 బాధ్రపదమాసం అమావాస్య రోజున ( సెప్టెంబర్​ 21)   ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  . ఆసమయంలో  సూర్యుడు.. చంద్రుడు.. బుధుడు .. కన్యారాశిలో సంచరిస్తారు.   అయితే సాధారణంగా గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది.   దీనివలన  మూడు రాశుల వారికి ( వృషభం.. సింహం.. తుల)  బాగా కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

వృషభ రాశి:  సూర్యగ్రహణం ఎఫెక్ట్​ తో ఈ రాశి వారికి  చాలా లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పెండింగ్​పనులు పూర్తి కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది.  40 రోజుల పాటు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  వ్యాపారస్తులు బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు కలసి వస్తాయి.  కెరీర్​ పరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.  ఉద్యోగస్తులు ప్రోత్సాహకాలు అందుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

 సింహ రాశి :  సూర్యగ్రహణం ప్రభావంతో ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.  గతంలో మిమ్ములను విబేధించిన వారు మీ సలహా కోసం రావలసిన పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా కలిసి రావడంతో వీరి ఆనందానికి అవధులు ఉండవు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. న్నాయి.

తులా రాశి : సూర్యగ్రహణ ప్రభావంతో  ఈ రాశి వారు డబ్బును ఎక్కువుగా పొదుపు చేస్తారు. సమాజంలో గౌరవం.. కీర్తి... ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు వారి బిజినెస్​ ను విస్తరించుకొనే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్​ రావడం.. వేతనం పెరిగే అవకాశం ఉందని 

తుల రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావంతో చాలా బాగుటుంది. ఈ రాశి వారు కోట్లలో డబ్బులు సంపాదించడం ఖాయం. అంటే వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.  కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ, 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం., ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 (సెప్టెంబర్ 22) వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్థరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది.