రూ.14 వేల కోట్లతో ట్రిపుల్‌‌‌‌ ఆర్ నార్త్.. 161 కి. మీ మేర ఆరు వరుసల రోడ్డు.. రీ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న ఇంజినీర్లు

రూ.14 వేల కోట్లతో ట్రిపుల్‌‌‌‌ ఆర్ నార్త్.. 161 కి. మీ మేర ఆరు వరుసల రోడ్డు..  రీ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న ఇంజినీర్లు
  • ఇంజినీరింగ్ పనులకు రూ.9 వేల కోట్లు, భూ సేకరణకు రూ. 5 వేల కోట్లు
  • టెక్నికల్‌‌‌‌ స్క్రూటీని కమిటీకి చేరనున్న ఫైల్
  • ఆ తర్వాత మినిస్టీరియల్‌‌‌‌, కేబినెట్‌‌‌‌ ఆమోదంతో పనులు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ విభాగం అంచనాలు రూ.14 వేల కోట్లకు చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభం కానున్న నార్త్‌‌‌‌ పార్ట్.. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ముగుస్తుంది. మొత్తం 161.5 కిలో మీటర్ల మేర ఆరు వరుసల రోడ్డు నిర్మించనున్నారు. 

ఇందుకోసం నేషనల్‌‌‌‌ హైవేస్‌‌‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ) ఇంజినీర్లు రీ ప్రపోజల్స్ చేయడం దాదాపు పూర్తయ్యింది. కొత్తగా తయారుచేసిన రీ ప్రపోజల్స్‌‌‌‌ ప్రకారం ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నార్త్ విభాగం రోడ్డు పనుల ఇంజినీరింగ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ కోసం రూ.9 వేల కోట్లు, భూసేకరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. రీప్రపోజల్స్‌‌‌‌ ఫైల్‌‌‌‌ ముందుగా ఇంజినీరింగ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో టెక్నికల్‌‌‌‌ స్క్రూట్నీ కమిటీ ఆమోదం పొందాక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మినిస్టీరియల్ విభాగం, కేబినెట్ ఆమోదంతో పట్టాలెక్కనున్నది.

రాష్ట్ర సర్కార్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం

రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్ పార్ట్ పనులకు సంబంధించి 161.5 కిలోమీటర్ల మేర గ్రీన్‌‌‌‌ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌‌‌‌ హైవేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్నది. దీనికి సంబంధించి సర్వేలు కంప్లీట్‌‌‌‌ చేసిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గతేడాది డిసెంబర్‌‌‌‌లోనే టెండర్లు పిలిచింది. నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం రూ.7,104.06 కోట్ల వ్యయంతో ఐదు ప్యాకేజీలుగా టెండర్లు పిలువగా టెక్నికల్, ఫైనాన్షియల్‌‌‌‌ టెండర్‌‌‌‌ దాఖలుకు గడువు ఇచ్చారు. 

టెండర్ దక్కించుకున్న కంపెనీ రెండేండ్లలో పనులు పూర్తి చేసి ఐదేండ్లు మెయింటెనెన్స్ చేపట్టాలని టెండర్‌‌‌‌లో స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత హైవేను ఆరు వరుసలుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టెండర్లు తెరవలేదు. రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోంది. భవిష్యత్‌‌‌‌ అవసరాల రీత్యా ఆరు లేన్లుగా నిర్మిస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రానికి నివేదించింది. 

దీనికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ ఇంజినీర్లతో రీప్రపోజల్స్‌‌‌‌కు ఆర్దర్స్ జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా సర్వే చేసిన ఇంజనీర్లు రూ.9 వేల కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్‌‌‌‌కు, రూ.5 వేల కోట్లు భూ సేకరణకు ఖర్చవుతాయని రీ ప్రపోజల్స్ రెడీ చేసి కేంద్రానికి పంపించారు. ఈ ఫైల్‌‌‌‌పై రాష్ట్ర స్థాయిలో టెక్నికల్ స్క్రూటీని కమిటీ చర్చించి ఆమోదం పొందిన తర్వాత మినిస్టీరియల్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాత కేబినెట్‌‌‌‌లో సీఎం, మంత్రులంతా చర్చించి ఆమోదిస్తే టెండర్‌‌‌‌ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.

భూ సేకరణకు రూ.5 వేల కోట్లు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్‌‌‌‌ ఆర్ ప్రాజెక్ట్‌‌‌‌లో వేగం పుంజుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి పలుమార్లు ప్రధాని మోదీతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌‌‌‌ గడ్కరీని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నిర్మాణంపై గడ్కరీతో సీఎం రేవంత్​ ఢిల్లీలో  ఇటీవల చర్చించి వర్క్స్ స్పీడప్‌‌‌‌ చేయాలని కోరారు. 

ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు మొత్తం సుమారు 4,793 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో సుమారు 178 ఎకరాలు ఫారెస్ట్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ ఉంది. ఇప్పటికే భూ సేకరణ సర్వేలు కంప్లీట్ చేశారు. 100 మీటర్ల పరిధిలో నిర్మించే ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టే మండలాల్లోని గ్రామాల వారీగా సర్వే నంబర్లను పేర్కొంటూ హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారు. అభ్యంతరాల కోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ నార్త్‌‌‌‌ పార్ట్‌‌‌‌లో ఏ రైతుకు సంబంధించిన భూమి ఎంత విస్తీర్ణంలో పోతుందో తెలియజేస్తూ ఫైనల్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ చట్టాల ప్రకారం రైతులకు చెక్కులు అందించి భూమి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ రీ ప్రపోజల్స్‌‌‌‌లో నార్త్ పార్ట్ వర్క్‌‌‌‌లకు అవసరమైన భూసేకరణ కోసం రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉండడంతో రైతులకు మేలు జరుగుతుందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. భూసేకరణ నిధుల్లో 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది.

టెండర్ ప్రాసెస్ పెండింగ్‌‌‌‌లో ఉంది

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ ప్రాజెక్ట్ నార్త్ పార్ట్‌‌‌‌కు సంబంధించి గత డిసెంబర్‌‌‌‌లో ఇచ్చిన టెండర్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ ఇంకా పెండింగ్‌‌‌‌లోనే ఉంది. వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. అయితే, ఈ రోడ్డును నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు పెంచడంతో రీప్రపోజల్స్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రపోజల్స్‌‌‌‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం పొందితే టెండర్ ప్రక్రియ చేపట్టే విషయంలో 40 రోజుల గడువు కలిసి వస్తుంది.  - శివశంకర్, రీజినల్ ఆఫీసర్, ఎన్​హెచ్​ఏఐ తెలంగాణ విభాగం