సిరిసిల్ల పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం.. ఆగ్రహంతో కొట్టి చంపిన స్థానికులు

సిరిసిల్ల పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం.. ఆగ్రహంతో కొట్టి చంపిన స్థానికులు

సిరిసిల్ల పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి.  బీవై నగర్, గోపాల్ నగర్, ఇందిరా నగర్, వెంకట్రావ్ నగర్ మార్కెట్ ఏరియా, సుందరయ్య నగర్, కొత్త బస్ స్టాండ్ ప్రాంతంల్లో వీధి కుక్కలు చెలరేగాయి. కుక్కల దాడిలో ఏకంగా 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

చికిత్స పొందుతున్న బాధితుల్లో  పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన స్థానికులు వాటిని కొట్టి చంపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కుక్కల బెడద ఉందంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారులు ఇకనైనా మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకపోతే తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు వీధి కుక్కలను కొట్టి  చంపడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూగ జీవాలను కొట్టి చంపడం కరెక్ట్ కాదని.. అధికారులు వీధి కుక్కులకు యాంటి రేబిస్ వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.